కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Vikarabad Accident) చోటు చేసుకుంది. అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం ఆటో- లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వికారాబాద్ మండలం పెండ్లిమడుగు నుంచి కేరెల్లికి ఆటోలో వెళుతుండగా బుగ్గరామేశ్వరం సమీపంలో మలుపు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆటో డ్రైవర్ ఉన్నారు. పెండ్లమడుగు గ్రామానికి చెందిన పార్వతమ్మ, నగేష్, సరిత, చంద్రమ్మ గా గుర్తించారు.

