తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు.. చివరి నిమిషంలో విజయ్ కి భారీ షాక్

కలం, నేషనల్ డెస్క్: తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలన్న సినీ నటుడు విజయ్ (Vijay) విజ్ఞప్తికి గవర్నర్ నో చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసంగా 118 మంది ఎమ్మెల్యేలు ఉండాలని, కానీ సొంతంగా 112 మంది సభ్యులతో పాటు కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నదని విజయ్‌కు గవర్నర్ (Government) వివరించారు. మొత్తంగా 112 మంది ఎమ్మెల్యేల సపోర్టు మాత్రమే ఉన్నందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలం లేదనే కారణాన్ని చూపి తిరస్కరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనంత బలాన్ని నిరూపించుకోడానికి గడువు ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ను కోరినట్లు తెలిసింది. రెండు వారాల్లో 118 మంది ఎమ్మెల్యేల మద్దతును లోక్‌భవన్ వేదికగానే నిరూపించుకోనున్నట్లు విరించినట్లు తెలిసింది. కానీ విజయ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదని, అందువల్ల ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యం కావచ్చని లోక్‌భవన్ వర్గాల సమాచారం.

ప్రమాణ స్వీకారం కార్యక్రమం వాయిదా

తమిళగ వెట్రి కజగం పార్టీ లీడర్లు రూపొందించిన షెడ్యూలు ప్రకారం మే 7న ఉదయం 11 గంటలకు జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరగనున్నది. కానీ గవర్నర్ అనుమతి నిరాకరణతో ప్రమాణ స్వీకారం కార్యక్రమం వాయిదా పడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>