కలం, వెబ్‌డెస్క్: వైసీసీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) నేడు పల్నాడు ఎస్పీ జగదీష్‌ను కలిశారు. ఇటీవల తనను చిలకలూరిపేట ఎస్సై ప్రియాంక తోసివేసిన ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ఓ వైసీపీ అభ్యర్థి విడదల రజినిని కలిసేందుకు ఆమె ఇంటికి వచ్చారు. అయితే ఎస్సై ప్రియాంక ఆయనను అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో విడదల రజిని స్వయంగా బయటకు వచ్చే అతడని కలవాలని అనుకున్నారు. అయితే ఎస్సై ఆమెను కూడా గేటు నుంచి బయటకు రానివ్వలేదు.
ఈ క్రమంలో జరిగిన తోపులాటలో రజిని కింద పడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తనను మూడు రోజుల నుంచి హౌస్ అరెస్ట్ చేకశారని రజిని ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ కూడా స్పందించింది. ఎస్సై ప్రియాంకను అన్ని విధుల నుంచి వెంటనే తప్పించాలని పల్నాడు ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 5లోపు క్రమశిక్షణ చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తాజాగా విడదల రజిని ఎస్పీని స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

