కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఏఈఈ పరీక్ష (TGPSC AEE Exam) తేదీ మార్చుతూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ముందు నవంబర్ 6వ తేదీన జరగాల్సిన ఎగ్జామ్ ను 7 వ తేదీకి వాయిదా వేసింది. ఎస్ఎస్‌సీ, జేఈ పరీక్షలు నవంబర్ 6 జరగనుండగా అదే రోజు ఏఈఈ పరీక్ష ఉంది.
దీంతో ఏఈఈ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని అభ్యర్థులు కమిషన్ కు విన్నవించారు. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ పరీక్ష తేదీని మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. ఒకే రోజు ఈ రెండు ఎగ్జామ్స్ ఉన్న వారు ఈ నెల 30 వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత సర్టిఫికేట్లు కమిషన్ కు సబ్మిట్ చేయాలని సూచించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ మార్పును గమనించాలని కోరింది.
Also Read : సోషల్ మీడియా రూమర్లపై రష్మిక ఘాటు రిప్లై!
Follow Us On: X(Twitter)

