ఎర్రుపాలెంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు

కలం, ఎర్రుపాలెం : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం (Yerrupalem) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC Elections) మండల స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, శాసనమండలి మాజీ సభ్యులు పోట్ల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ తమ పరిధిలోని పట్టభద్రులను గుర్తించి ఓటు నమోదు చేయించాలని, తద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి గెలుపునకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. నవంబర్ 06వ తేదీ వరకు ఓటర్ల నమోదు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెజెండ్ల సాయి కుమార్, టీపీసీసీ నాయకులు శీలం ప్రతాప్ రెడ్డి, భద్రాచలం మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆయులూరి వెంకటేశ్వర రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>