దూసుకొస్తున్న ‘అర్న‌బ్‌’.. సీఎం చంద్ర‌బాబు స‌మీక్ష‌!

క‌లం, వెబ్‌డెస్క్: బంగాళా ఖాతంలో దూసుకొస్తున్న‌ అర్న‌బ్ తుఫాన్ (Cyclone Arnab) ఏపీ తీర ప్రాంతాల‌ను వ‌ణికిస్తోంది. తుఫాన్ హెచ్చ‌రిక‌ల‌తో ఏపీ ప్ర‌భుత్వం హై అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) అధికారుల‌తో అత్య‌వ‌స‌ర స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. ఇప్ప‌టికే తుఫాన్ ముప్పు ఉన్న కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు రేపు, ఎల్లుండి సెలవులు ప్రకటించారు.

జిల్లాలో 101 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్లొద్ద‌ని అధికారులు సూచించారు. తీర ప్రాంతాల్లోని 80 వేల మందిని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కాగా, కోనసీమ, ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ తుఫాన్ (Cyclone Arnab) పరిణామాలపై సీఎం చంద్ర‌బాబు అధికారుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. తుఫాన్‌ గమనాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తీరప్రాంత ప్రజలను సురక్షిత షెల్టర్లకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులు, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని సూచించారు.

అలాగే, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించి, ప్రాజెక్టుల్లోని పరిస్థితిని పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ తుఫాన్ బుధ‌వారం ఉద‌యం బాప‌ట్ల‌, యానాం మ‌ధ్య తీరం దాటే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

Also Read : ఎస్సై ప్రియాంక‌పై విడ‌ద‌ల ర‌జిని కంప్లైంట్‌!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>