కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy)కి వీబీ-జీ రామ్ జీ ఉద్యోగులు సన్మానం చేశారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేసినందుకు ఆయనకు అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆట) ఆధ్వర్యంలో కమ్యూనిటీ సర్వీస్ పురస్కారం ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని వీబీ-జీ రామ్ జీ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు.
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. విద్యాభివృద్ధికి చేస్తున్న సేవలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం మహబూబ్‌నగర్‌కు గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీబీ-జీ రామ్ జీ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు శివ ప్రసాద్, సభ్యులు వెంకటేశ్వర్లు, విజయభాస్కర్, కరుణాసాగర్, విష్ణువర్ధన్ రెడ్డి, ఆనంద్, కళ్యాణి, లత కుమారి, సుజిత తదితరులు పాల్గొన్నారు.

