వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు యువకులు గల్లంతు

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లాలో వినాయక నిమజ్జనం విషాదంగా మారింది. అక్బర్‌పేట-భూంపల్లి మండలం రుద్రారం (Rudraram) పెద్ద చెరువులో వినాయక నిమజ్జనం అనంతరం స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో గల్లంతయ్యారు. రుద్రారం గ్రామానికి చెందిన పార రమేష్ (35), కలాల్ నవీన్ (25) శనివారం రెండు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లారు.

నిమజ్జనం పూర్తైన తర్వాత చెరువులో స్నానం చేస్తుండగా ఇద్దరూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయినట్లు స్నేహితులు తెలిపారు. గమనించిన తోటి యువకులు వెంటనే చెరువులో గాలించినా వారి ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిమజ్జనం కోసం చెరువు వద్దకు వచ్చే భక్తుల భద్రతకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు యువకులు గల్లంతవడంతో రుద్రారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన యువకుల కోసం చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>