కలం, వెబ్ డెస్క్ : విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. నగరంలోని అంబెడ్కర్ కళావేదిలో మేయర్, కర్పొరెటర్ల ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి, కలెక్టర్ లక్ష్మీ శా వంగవీటి రాధాకృష్ణతో మేయర్గా ప్రమాణం చేయించారు. అనంతరం నగరంలోని కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు.
దీంతో విజయవాడ నగర పాలక సంస్థలో కొత్త పాలకవర్గం అధికారికంగా కొలువుదీరింది. ఆంధ్రప్రదేశ్లోని పలు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోనూ నూతన పాలకవర్గాల బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలు జరిగాయి. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసి పాలనలోకి అడుగుపెట్టారు.
డోన్ మున్సిపల్ ఛైర్మన్గా కోట్ల సుజాతమ్మ, ఏలూరు నగర మేయర్గా రెడ్డి అప్పలనాయుడు, కర్నూలు మేయర్గా బొల్లెద్దుల విజయ ప్రత్యూష, తిరువూరు మున్సిపల్ ఛైర్పర్సన్గా పసుపులేటి మాధవి బాధ్యతలు స్వీకరించారు. ఆయా పట్టణాలు, నగరాల్లో కొత్త పాలకవర్గాలు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాయని ఆశిస్తున్నారు. కొత్త పాలకుల బాధ్యతల స్వీకరణతో స్థానిక సంస్థల పాలనలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. కాగా, నగరంలోని 86 డివిజన్లలో టీడీపీ 53, జనసేన 19, వైసీపీ 8, బీజేపీ 4, సీపీఎం ఒక డివిజన్లో గెలిచిన విషయం తెలిసిందే.

