ట్రోఫీ గెలుపులో వైభవ్ మైండ్ గేమ్!

కలం, స్పోర్ట్స్ : ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ జట్టు దులీప్ ట్రోఫీ 2026-27 టైటిల్‌ను ముద్దాడింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 350కి పైగా రన్లు చేసి ఇషాన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అయితే ఈ విజయంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ప్రదర్శించిన మైండ్ గేమ్స్, వ్యూహాత్మక చతురత అభిమానుల దృష్టిని విశేషంగా ఆకట్టుకున్నాయి. వైస్ కెప్టెన్‌గా ఉన్న వైభవ్, మైదానంలో పక్కా వ్యూహాలతో ప్రత్యర్థి జట్టుకు షాక్ ఇచ్చాడు.

ఇషాన్ గాయపడి బయటకు వెళ్లిన సమయంలో జట్టును సమర్థవంతంగా నడిపించి తొలిసారి విజయవంతమైన డిఆర్ఎస్ పిలుపులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో ఇషాన్ మైదానంలో ఉన్నప్పటికీ, రివ్యూల విషయంలో వైభవ్‌దే కీలక పాత్రగా మారింది. సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్లో కెప్టెన్ ఇషాన్‌ను ఒప్పించి మరి వైభవ్ రివ్యూ తీయించిన తీరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. బీసీసీఐ పంచుకున్న వీడియోలో ఇషాన్ మాట్లాడుతూ, “తాను రివ్యూ తీసుకుందామనుకునే లోపే వచ్చి ఒత్తిడి తెచ్చి ఆ క్రెడిట్ అంతా వైభవ్ కొట్టేశాడు” అని సరదాగా వ్యాఖ్యానించాడు.

దీనికి వైభవ్ వెంటనే స్పందిస్తూ, “మీరు గాయంతో బయటకు వెళ్లినప్పుడు రివ్యూలు ఎవరు తీసుకున్నారో కూడా చెప్పండి” అని చమత్కరించాడు. ఈ కుర్రాడి సమయస్ఫూర్తిని, నాయకత్వ లక్షణాలను ఇషాన్ మనస్ఫూర్తిగా ప్రశంసించాడు. భవిష్యత్తులో వైభవ్ గొప్ప కెప్టెన్ అయ్యే అవకాశం ఉందన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్లు, జూనియర్లను ఆప్యాయంగా చూసుకునే వైభవ్, రాబోయే రోజుల్లో భారత్ తరఫున మరింత ప్రమాదకర బ్యాటర్‌గా, లీడర్‌గా ఎదుగుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>