కలం, హనుమకొండ : హనుమకొండ పద్మాక్షి రోడ్ మారుతి హిల్స్ లో గల శ్రీ వారాహి సహిత ఉన్మత్త భైరవ దేవాలయం (Unmatta Bhairava Temple) లో శుక్రవారం మహా పాలాభిషేకం నిర్వహించారు. అమ్మవారికి, స్వామివారికి 108 లీటర్ల ఆవుపాలతో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు వీరభద్రనాధ్ మాట్లాడుతూ.. ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైనదని, వందేళ్లకు ఒకసారి వచ్చే ఈ అమావాస్య రోజు భక్తిశ్రద్ధలతోటి భక్తులు పాల్గొని కూష్మాండ దీపం, మిరియాల దీపం, నారీకేల దీపాలు పెట్టి వారి భక్తిని చాటుకుంటారని అన్నారు. అమ్మవారికి, స్వామివారికి అంత్యంత వైభవంగా అలంకరణ, మహా హారతి, అన్నదాన ప్రసాదం నిర్వహించారు.

