కలం, వెబ్ డెస్క్ : అమెరికా వీసా (US Visa) ల కోసం వేచి చూస్తున్న దరఖాస్తుదారులకు ట్రంప్ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ అయిన పలు ఇంటర్వ్యూలను కూడా అమెరికా అధికారులు రద్దు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ డిప్లొమాటిక్ ఆఫీసుల్లో కాన్సులర్ అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని విదేశాంగ శాఖ తెలిపింది. వీసా దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా, సమగ్రంగా పరిశీలించేందుకే ఈ ఇంటర్నల్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నామని వివరించింది. ఈ శిక్షణ ప్రక్రియను పూర్తి చేసే క్రమంలోనే అపాయింట్మెంట్ షెడ్యూళ్లలో మార్పులు చేశామని, రద్దయిన అపాయింట్మెంట్ల స్థానంలో కొత్త తేదీలను త్వరలోనే కేటాయిస్తామని వెల్లడించింది.

