Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌కు బిగ్ షాక్

కలం, వెబ్ డెస్క్ : అమెరికా సుప్రీంకోర్టులో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) కు బిగ్ షాక్ తగిలింది. అమెరికాలో అక్రమ వలసదారులకు పుట్టే పిల్లలకు ఆటోమెటిక్ పౌరసత్వం ( బర్త్ రైట్ సిటిజన్ షిప్) నిలిపివేయాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగ సవరణ విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు 14వ రాజ్యాంగ సవరణ ద్వారా లభించే జన్మహక్కును కోర్టు 6‌‌‌‌‌-3 మెజారిటీతో సమర్థించింది. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఉండాల్సిందేనని తీర్పు ఇచ్చింది.

కాగా, 1868 లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన బర్త్ రైట్ సిటిజన్ షిప్ ద్వారా తల్లిదండ్రుల వీసా, పౌరసత్వంతో సంబంధం లేకుండా అమెరికా భూభాగంపై జన్మించిన ఎవరికైనా ఆటోమెటిక్‌గా అమెరికా పౌరసత్వం వస్తుంది. అయితే రెండో సారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ విదేశీయులు, వారికి పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వకుండా బర్త్ రైట్ సిటిజన్ షిప్ ను తొలగిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా సుప్రీంకోర్టు తాజాగా చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దీంతో అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఆ దేశ పౌరసత్వం పాత పద్ధతి ప్రకారమే కొనసాగనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>