Mobile Popup Ad
Mobile Popup Ad

అణ్వాయుధాలు వీడితేనే చర్చలు: డోనాల్డ్ ట్రంప్

కలం, వెబ్‌ డెస్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఇరాన్‌పై విధిస్తున్న నౌకాదళ దిగ్బంధం విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దిగ్బంధం అద్భుతంగా పనిచేస్తోందని, అమెరికా నౌకాదళం శక్తి సామర్థ్యాలకు ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు. కేవలం అగ్రిమెంట్లు, కాగితాల కోసం వేల మైళ్ల దూరం 18 గంటల పాటు ప్రయాణించే పద్ధతికి స్వస్తి పలికినట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖాముఖి చర్చలంటే తనకు ఇష్టమే అయినప్పటికీ, అటువైపు నుంచి సానుకూలత లేనప్పుడు పదేపదే విమాన ప్రయాణాలు చేయడం అర్థరహితమని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాలను వదులుకోవడానికి సిద్ధపడితే తప్ప ఎటువంటి ఒప్పందాలు కుదిరే ప్రసక్తి లేదని ట్రంప్ (Trump) పేర్కొన్నారు. అమెరికాతో ఆటలాడటం ఇకపై ఎవరికీ సాధ్యం కాదని హెచ్చరించారు. ప్రపంచ శాంతి కోసమే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>