కలం, వెబ్ డెస్క్ : యునైటెడ్ స్టేట్స్ మెరైన్ కార్ప్స్‌కు చెందిన హార్నెట్ యుద్ధ విమానం (Fighter Jet Crash) శిక్షణా సమయంలో కుప్పకూలింది. విమానం తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండగా నియంత్రణ కోల్పోయి నేలపైకి పడింది. విమానం నేలపై జారుతూ వెళ్తున్న క్రమంలో మంటలు చెలరేగాయి. అయితే, చాకచక్యంగా వ్యవహరించి సకాలంలో ఎజెక్ట్ అయి పారాషూట్ ద్వారా సురక్షితంగా నేలకు దిగాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతపెద్ద ప్రమాదం జరిగినా పైలట్ కు చిన్నగాయాలు మాత్రమే అయ్యాయని అధికారులు తెలిపారు. విమానం నేలపై పడిన తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఈ ఘటనపై యుఎస్ మెరైన్ కార్ప్స్ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ప్రాథమికంగా టెక్నికల్ లోపం లేదా ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Battle Jet FA-18 Crashed Landing! Pilot’s Incredible Escape. pic.twitter.com/wTv0uviaQC
— Science Joy (@InsideOurBodies) June 20, 2026

