నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలి: సునీతా లక్ష్మారెడ్డి

కలం, మెదక్ బ్యూరో: ఆకాల వర్షాలతో నష్టపోయిన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మధుర, కొన్యాల్ గ్రామాల్లోనీ పంట పొలాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Laxma Reddy) పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వడ్లు కొట్టుకుపోయి పంటలను, నష్టాన్ని పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. సకాలంలో ప్రభుత్వం ధాన్యంను కొనుగోలు చేయకపోవడంతోనే రైతులు వర్షాల కారణంగా నష్టపోయరని, తడిసిన ధాన్యంను కొనుగోలు చేసి ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని , రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>