కలం, వెబ్ డెస్క్ : న్యూఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు కీలకమైన కేంద్ర కేబినెట్ సమావేశం (Union Cabinet Meeting) జరగనుంది. రాబోయే దసరా, దీపావళి పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఈ భేటీలో పలు ముఖ్యమైన ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైల్వే ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) ప్రకటించే అంశంపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.
ప్రతీ ఏటా పండుగ ముందస్తు కానుకగా రైల్వే గెజెటెడ్ యేతర సిబ్బందికి అందించే ఈ బోనస్ ప్రకటన కోసం ఉద్యోగ వర్గాలు ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. దీనితో పాటు మౌలిక వసతుల కల్పన, ఆర్థిక శ్రేయస్సుకు సంబంధించిన మరికొన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా కేంద్ర మంత్రిమండలి ఈ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

