రోహిత్ క‌మ్‌బ్యాక్‌.. సూర్య కుమార్ రియాక్షన్

క‌లం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) చేసిన పోస్టులు ఆసక్తి రేపుతున్నాయి. టీ20 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ అయినప్పటికీ, ముంబై పగ్గాలు తనకు కాకుండా రోహిత్‌కు దక్కినప్పటికీ సూర్య ఎలాంటి అసంతృప్తి చూపలేదు. రోహిత్ పేరు ప్రకటించిన వెంటనే సూర్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నీలం రంగు హార్ట్ ఎమోజీలను పంచుకున్నాడు.

ఆ తర్వాత మరో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రోహిత్‌ను నాయకుడు, అన్నయ్య, మెంటార్ అని పేర్కొన్నాడు. అలాగే పల్టాన్ అంతా సీట్ బెల్టులు బిగించుకోవాలని ఉత్సాహంగా వ్యాఖ్యానించాడు. కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికీ సూర్య చూపిన ఈ స్పోర్టివ్ స్పిరిట్, రోహిత్‌కు ఇచ్చిన మద్దతు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో వీరిద్దరి సమన్వయం జట్టుకు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>