epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

తొలి నుంచీ రక్షణ రంగానికే అగ్రతాంబూలం!

కలం, తెలంగాణ బ్యూరో: స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2025 వరకు 94 బడ్జెట్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏ బడ్జెట్ (Union Budget) ను తీసుకున్నా.. కేటాయింపులు మాత్రం భారీగా రక్షణ రంగానికే ( Defence) దక్కాయి. కారణం.. పొరుగు దేశాల నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉన్నా దీటుగా ఎదుర్కొనేందుకే!! తొలి బడ్జెట్ లో అయితే ఏకంగా 47 శాతం ఈ రంగానికే కేటాయించారు. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ప్రవేశపెట్టిన బడ్జెట్లలో సగటున 14 శాతం డిఫెన్స్ సెక్టార్ కే అలకేషన్స్ జరిగాయి.

– 1947 –48 బడ్జెట్ మొత్తం వ్యయం రూ.197.39 కోట్లు అయితే.. అందులో 92.74 కోట్లు రక్షణ రంగానికి కేటాయించారు. అంటే 47శాతం.
– 1963–64 మొత్తం బడ్జెట్ రూ. 2,482 కోట్లు అయితే.. అందులో 33 శాతం అంటే 816 కోట్లు డిఫెన్స్ కు దక్కింది.
– కేంద్రంలో మోదీ సర్కార్ కొలువు దీరిన తర్వాత 2014 నుంచి 2025 వరకు మొత్తం 12 బడ్జెట్లను ఇందులో 10 పూర్తి స్థాయి, 2 మధ్యంతర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఈ 12 బడ్జెట్ల మొత్తం రూ.3,66,44,505 కోట్లు! ఇందులో సగటున 14 శాతం (13.8శాతం) వరకు కేటాయింపులు డిఫెన్స్ సెక్టార్ కే దక్కాయి. 12 బడ్జెట్లలో ఈ రంగానికి రూ.50,74,770 కోట్లు వచ్చాయి.
– 2025 బడ్జెట్ (Union Budget) లో కేంద్రం రూ. 6 లక్షల 50వేల కోట్లు రక్షణ రంగానికి కేటాయించింది.

Read Also: కేంద్ర బడ్జెట్ : ఆసక్తికర విశేషాలు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>