నిర్మలమ్మ బడ్జెట్.. ఏ రంగానికి ఎన్ని కోట్లంటే..

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ (Union Budget 2026) ప్రవేశపెట్టారు. కర్తవ్య భవన్‌లో రూపొందించిన మొదటి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. ఇక ఈ బడ్జెట్‌కు సంబంధించి పట్టణీకరణ, మౌలిక సదుపాయాలు అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆరోగ్యం కోసం బయో ఫార్మా శక్తి స్కీమ్ కోసం రూ. 10 వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్ కాంపొనెంట్ల తయారీ స్కీమ్ కింద రూ. 40 వేల కోట్లు, ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మెటల్స్, ఖనిజ పరిశ్రమల ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమల ఏర్పాటుకు రూ. 10 వేల కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు.

వీటిని ప్రోత్సహించేందుకు రూ. 2 వేల కోట్ల గ్రోత్ ఫండ్ కేటాయించామన్నారు. ‘ఛాలెంజ్ మోడ్‌లో మెగా టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటు చేస్తున్నామని.. నేత కార్మికులకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఖాదీ ఉత్పత్తిని ఎంకరేజ్ చేసే కార్యాచరణ రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ గ్రామ్ స్వరాజ్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. సెమీ కండక్టర్ మిషన్ స్కీమ్‌కు భారీగా నిధులు కేటాయించారు. కొత్తగా మూడు నైపర్‌లు ఏర్పాటు చేయబోతున్నారు.

Read Also: జ‌న‌వ‌రిలో జీఎస్టీ వ‌సూళ్లు రూ.1.93 ల‌క్ష‌ల కోట్లు..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>