జ్యోతిరావు ఫూలేకు మాల సంఘాల ఘన నివాళి

కలం, కరీంనగర్: మహాత్మా జ్యోతిరావు ఫూలే (Jyotirao Phule) 136వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ కలెక్టర్ రోడ్డులోని అంబేద్కర్ భవన్‌లో మాల మహానాడు సంఘాల (Mala Community) నాయకుల ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దామెర సత్యం మాట్లాడుతూ.. కుల వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలు, అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా ఫూలే అని కొనియాడారు. మహిళలు, అణగారిన వర్గాలకు విద్యను అందించాలని, విద్య ద్వారానే వివక్ష నుంచి విముక్తి పొందవచ్చని చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి ఫూలే అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నేటి యువత స్ఫూర్తి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మాల సంఘాల నాయకులు మేడి రాజవీర్, వెన్న రాజమల్లయ్య, దామెర సత్యం, మేడి మహేష్, పాటకుల భూమయ్య, గూడ కనకయ్య, బొలుమాల సదానందం, రుద్రవట్ల తిలక్ రాజు, చాతాల్ల కృష్ణ, నర్సయ్య, కర్ణె పవన్ కుమార్, నాయిని అంజయ్య, రాజమౌళి తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>