దీక్షా దివస్ సభకు జనసమీకరణపై దాసరి ఫోకస్

కలం, పెద్దపల్లి : కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో నిర్వహించనున్న ‘దీక్షా దివస్ స్ఫూర్తి’ బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి (Dasari Manohar Reddy) పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్న ఈ సభను విజయవంతం చేయాలని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు, యువత, పార్టీ శ్రేణులను కోరారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్ మండలాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు, జనసమీకరణపై చర్చించారు. ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేటీఆర్ పాల్గొనే సభను విజయవంతం చేయాలని దాసరి మనోహర్ రెడ్డి కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>