కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda) జిల్లాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులకు దేహశుద్ధి చేశారు. కుమార్‌పల్లి మార్కెట్ ఏరియాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందినవారుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు.. కాలనీల్లో తిరుగుతున్నారు. వారి కదిలికలు అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే వారిగా అనుమానించారు. దీంతో, ఇద్దరిని కొట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి, విచారణ చేస్తున్నారు. పిల్లలను మాటల్లో పెట్టి, వారిని అపహరించే ముఠాలు సంచరిస్తున్నాయనే సమాచారం నేపథ్యంలో పోలీస్ బందోబస్త్ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read : పరకాల నియోజకవర్గానికి సీఎం అభివృద్ధి వరాలు
Follow Us On: Instagram

