epaper
Tuesday, March 3, 2026
epaper

తిరునెల్వేలిలో ఘోరం.. ఒడిశా వలస కార్మికుడిని నరికి చంపారు

కలం, వెబ్​ డెస్క్​: తమిళనాడులో ఘోరం జరిగింది. తొమ్మిది మంది సభ్యుల ఓ ముఠా కత్తులతో ఇద్దరిని దారుణంగా నరికి చంపింది. మరో ఐదుగురిని తీవ్రంగా గాయపర్చింది. చనిపోయినవాళ్లలో ఒకరు స్థానికుడు కాగా, మరొకరు ఒడిశా నుంచి వచ్చిన వలస కార్మికుడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరునెల్వేలి(Tirunelveli) జిల్లా నంగునేరి సమీపంలోని ఓ టీషాపు వద్ద సోమవారం రాత్రి కొందరు టీ తాగుతుండగా హఠాత్తుగా తొమ్మది మంది సభ్యుల గ్యాంగ్​ మూడు బైక్​ల్లో అక్కడికి వచ్చి, దాడికి దిగింది. కర్రలు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసింది. దీంతో పెరుంపత్తు గ్రామానికి చెందిన జాన్​ మార్క్​(47)తో పాటు ఒడిశా వలసకార్మికుడు శ్రీనాథ్​ గడ్డ(57) అక్కడికక్కడే మరణించారు. ఎ.నెల్సన్​, ప్రభాకరన్​, వి.రామస్వామి, ఎ.గణేశన్​, ఎస్​.శశికుమార్​ తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విషయం తెలిసి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్నారు. దాడికి కారణమేంటో తెలియలేదని పోలీసులు వెల్లడించారు. హంతకులను పట్టుకోవడానికి స్పెషల్​ టీమ్​లను ఏర్పాటుచేశారు. ఇద్దరి దారుణ హత్యతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మంగళవారం ఉదయం రోడ్డు రోకో నిర్వహించారు. హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

మరోవైపు ఈ హత్యలు(Tirunelveli) తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు రేపాయి. డీఎంకే పాలనలో రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఈ ఘటన నిదర్శనమని ఏఐఏడీంకే విమర్శించింది. తమిళనటుడు, హీరో విజయ్​ టీవీకే పార్టీ సైతం.. అధికార పార్టీని తీవ్రంగా తప్పుపట్టింది. డీఎంకే పాలనలో అరాచకశక్తులు పేట్రేగిపోతున్నాయని, ఇది ప్రభుత్వ అసమర్థత అని మండిపడింది.

కాగా, ఇటీవల తమిళనాడులోని ఓ రైల్లో ఒడిశా వలస కార్మికుడిని కొందరు యువకులు కట్టేసి కొట్టి, దారుణంగా హింసించి, వీడియో తీసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పడు ఏకంగా మరో ఒడిశా వ్యక్తిని కత్తులతో నరికి చంపడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Read Also: యాదాద్రి జిల్లాలో విషాదం: ఇద్దరు చిన్నారులను చంపి తల్లి ఆత్మహత్య

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!