Mobile Popup Ad
Mobile Popup Ad

పంట కాపలా ప్రాణాలు తీసింది: రెండు ఏనుగులు బలి!

కలం, వెబ్ డెస్క్​ : తిరుపతి (Tirupati) జిల్లా నెరబైలు సమీపంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తురకపల్లి పరిసరాల్లోని మామిడితోపులో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి రెండు ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. స్థానిక రైతు తన వేరుశనగ పంటను అడవి పందుల నుండి కాపాడుకోవడానికి పొలం చుట్టూ అక్రమంగా విద్యుత్ తీగలను అమర్చినట్లు తెలుస్తోంది. ఆహారం కోసం వెతుకుతూ వచ్చిన ఏనుగులు ప్రమాదవశాత్తు ఈ తీగలపై కాలు వేయడంతో విద్యుదాఘాతానికి గురయ్యాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన ఏనుగుల పరిస్థితిని సమీక్షించిన అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>