Mobile Popup Ad
Mobile Popup Ad

బెంగాల్‌లో చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌కు చేదు అనుభ‌వం

క‌లం, వెబ్ డెస్క్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)కు చేదు అనుభ‌వం ఎదురైంది. గుడిలో ద‌ర్శ‌నానికి వెళ్లిన ఆయ‌న‌కు టీఎంసీ (TMC) నేత‌లు న‌ల్ల‌జెండాల‌తో నిర‌స‌న తెలిపారు. వివ‌రాల్లోకి వెళ్తే.. నేడు పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారుల‌తో సమీక్ష‌ సమావేశాలు జ‌రుగ‌నున్నాయి. ఈ మేర‌కు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కోల‌క‌తాకు చేరుకున్నారు. కాళీమాత ద‌ర్శ‌నార్థం ఆల‌యానికి వెళ్లారు. అక్క‌డ టీఎంసీ నేత‌లు న‌ల్ల జెండాల‌తో నిర‌స‌న తెలుపుతూ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ ప్ల‌కార్డులు ప‌ట్టుకొని నిల్చున్నారు. బెంగాల్‌లో ఓట్ల తొల‌గింపుపై టీఎంసీ మొద‌టి నుంచి అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. ఏప్రిల్‌లో బెంగాల్ ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. మూడు రోజుల పాటు సీఈసీ బెంగాల్‌లో ప‌ర్యటించ‌నున్నారు. ఎన్నిక‌ల అధికారుల‌తో కీల‌క స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>