ప్రచారంలో విజయ్ దూకుడు.. సైకిల్ తొక్కుతూ, విజిల్స్ వేస్తూ!

కలం, వెబ్ డెస్క్: తమిళగ వెట్రి కళగం (TVK Chief) అధినేత, నటుడు విజయ్ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాడు. వరుస రోడ్ షోలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నాడు. ఇతర పార్టీలకు భిన్నంగా ప్రచారం పర్వంలో కదం తొక్కుతూ అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా యువత, మహిళలను తనవైపు తిప్పుకుంటూ తనదైన స్టైల్‌లో ప్రచారం చేస్తున్నాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో మరింత దూకుడు పెంచారు.

ఆదివారం కన్యాకుమారిలో వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కన్యాకుమారి వీధుల్లో ఆయన స్వయంగా సైకిల్ తొక్కుతూ ప్రజలను పలకరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. తన పార్టీ గుర్తు ‘విజిల్’ను ఊదుతూ కార్యకర్తలు, అభిమానుల దృష్టిని ఆకర్షించారు. జనాల కేరింతల మధ్య ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. సామాన్యులకు చేరువయ్యేలా విజయ్ చేసిన ఈ సైకిల్ యాత్రకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న విజయ్, ఈ ప్రచారం ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>