క‌ర్రెగుట్ట‌ల్లో మావోయిస్టుల భారీ ఆయుధ డంప్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ‌, చ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో ఉన్న‌ కర్రెగుట్టల్లో (Karregutta Hills) మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్థానికంగా పూజారి కాంకేర్ స‌మీపంలో తెలంగాణ పోలీసులు భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఈ ఆప‌రేష‌న్‌లో మావోయిస్టుల భారీ ఆయుధ డంప్‌ను గుర్తించారు.

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చ‌ర్లకు చెందిన పోలీసులు, గ్రే హౌండ్స్ బ‌ల‌గాల‌తో క‌లిసి ఈ భారీ కూంబింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఈ డంప్‌లో ర‌హ‌స్య ప్ర‌దేశంలో నిల్వ ఉంచిన 280 బ్యారెల్ గ్రెనేట్ లాంచ‌ర్ల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఆయుధ నిల్వ‌లు ల‌భించ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. క‌ర్రెగుట్ట‌ల్లో, ప‌రిస‌ర ప్రాంతాల్లో నిఘా మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు. అలాగే ఆయా ప్రాంతాల్లో కూంబింగ్ కొన‌సాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>