రేపటి నుంచి రైతు వారోత్సవాలు.. ప్రారంభించనున్న తుమ్మల

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 4 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వారోత్సవాలు నిర్వహించనున్నారు. తొలుత తాండూరులో సోమవారం రైతు వారోత్సవాలను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా టీజీ ఆర్గానిక్స్‌ యాప్‌ను ఆవిష్కరించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో అంశంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వహణపై కలెక్టర్, నోడల్ ఆఫీసర్లతో మంత్రి తుమ్మల మాట్లాడారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు.

రైతు వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ వేదికగా మంత్రి తుమ్మల (Tummala Nageswara Rao) మాట్లాడారు. చివరి రైతు వరకు ప్రభుత్వ పథకాల చేరవేతే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వారోత్సవాల్లో భాగంగా మట్టి ఆరోగ్యం, సహజ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తామని వివరించారు. మైక్రో ఇరిగేషన్‌పై రైతులకు సూచనలు ఇస్తామని అన్నారు. మార్కెట్ లింకేజులు, రుణాలపై వివరాలు సేకరిస్తామని తెలిపారు. డ్రోన్లు, యాంత్రీకరణ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. సౌరశక్తి వినియోగంపై అవగాహన కల్పిస్తామని.. పశువుల ఆరోగ్యం, చేపల ఉత్పత్తిపై రైతన్నలకు శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. వానకాలానికి ముందస్తు సాగునీటి చర్యలు చేపడుతున్నామని.. దీనిని జిల్లా కలెక్టర్లు, నోడల్ అధికారులుగా పర్యవేక్షిస్తారని వివరించారు.

Read Also: 5న మెగా రైతు మేళా.. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>