కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల కార్మికులకు ఈఎస్ఐ డిస్పెన్సరీ (ESI Dispensary) మరి కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వినతి మేరకు కార్మిక శాఖా మంత్రి వివేక్ వెంకట స్వామి సంగారెడ్డి పట్టణానికి ఈఎస్ఐ డిస్పెన్సరీ మంజూరు చేశారు. డిస్పెన్సరీ కోసం సంగారెడ్డి బైపాస్ రోడ్ లోని ఆర్ అండ్ బి క్వార్టర్‌ను కేటాయించారు. ప్రస్తుతం మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఈ పనులను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరిశీలించారు. బెడ్స్ ఏర్పాటుకు, అవసరమైన ల్యాబ్, మెడిసిన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంగారెడ్డి పట్టణంలోనే డిస్పెన్సరీ ఏర్పాటు అవుతుండటం సంతోషకరమని, సంగారెడ్డి చుట్టుపక్కల పరిశ్రమల్లో పని చేస్తున్న వేలాది కార్మికులకు ఈ డిస్పెన్సరీలో వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. మరమ్మతులు సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి, మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం చేస్తామని జగ్గారెడ్డి అన్నారు.
Read Also: పీఎంజే జ్యువెలరీ దాడి బాధితులను పరామర్శించిన ఐజీపీ
Follow Us On : WhatsApp

