Mobile Popup Ad
Mobile Popup Ad

శనగ, పొద్దుతిరుగుడు కొనుగోలుపై సీలింగ్‌ శాతాన్ని పెంచాలి: తుమ్మల

కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం పీఎస్‌ఎస్ పరిధిలో ఉన్న శనగ, పొద్దుతిరుగుడు పంటల కొనుగోలుపై అమలులో ఉన్న 25 శాతం సీలింగ్‌ను వెంటనే 50 శాతానికి పెంచాలని మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రికి మరోసారి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర రైతుల సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లాలన్నారు. శనగ, పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 50 శాతానికి పెంచించడంతో పాటు మొక్కజొన్న, జొన్నలను పీఎస్‌ఎస్‌లో చేర్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆ బాధ్యతల నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుని పనిచేస్తుంటే.. రేవంత్ సర్కార్ మాత్రం రైతు సంక్షేమమే పరమావధిగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.ఇందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతోందని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>