ఖమ్మం‌లో గోవింద నామస్మరణ.. టీటీడీ ఆలయానికి సర్వం సిద్ధం!

కలం, ​ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగర పరిధిలోని అల్లిపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయ భూమిపూజ మహోత్సవానికి రంగం సిద్ధమైంది. అక్టోబర్ 12న త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి సమక్షంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. శుక్రవారం భూమిపూజ ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సీపీ సునీల్ దత్, ఇతర అధికారులతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.

​భూమిపూజ కార్యక్రమానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల క్షేత్రం తరహాలోనే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. క్రమబద్ధమైన దర్శనానికి క్యూలైన్లు, బారికేడ్లతోపాటు వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం, పులిహోర, మజ్జిగ అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను టీటీడీయే పూర్తిగా పర్యవేక్షిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక మ్యాప్‌లతో పార్కింగ్ స్థలాలను కేటాయించడమే కాకుండా, వైద్యం, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్, అగ్నిమాపక సేవలను సిద్ధం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>