ఇంటర్ బోర్డు విలీనం, కరువు సమస్యలపై కవిత సంచలన వ్యాఖ్యలు!

కలం, నిజామాబాద్ బ్యూరో: ఇంటర్ విద్యా విలీనంపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నది ఏకపక్ష నిర్ణయం అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత (Kavitha) ఆక్షేపించారు. టీఆర్ఎస్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నదని ప్రకటించారు. నిజామాబాద్ లో కవిత మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఇంటర్ ఫస్ట్, సెకండియర్ చదువులు లక్షలతో భారంగా మారాయని.. అభిప్రాయ పడ్డారు. విలీనం చేస్తే ఏడో తరగతి నుంచే లక్షల రూపాయలు కార్పొరేట్ ఫీజులు అవుతాయని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడం, కార్పొరేట్ విద్యలో ఫీజులను నియంత్రించడం లేదా పాఠశాలల్లోనే 11, 12 తరగతులను ప్రవేశపెట్టడం వంటి చర్యలు తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఏం వసతులు పెంచకుండా.. ఏం సౌకర్యాలు కల్పించకుండా ఇంటర్ బోర్డు విలీనం అంటే ఎలా అని ప్రశ్నించారు. 15వ ఫైనాన్స్ నిధులు రాక సర్పంచులు ఇవ్వందులు పడుతున్నారని చెప్పారు. పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ పథకం 16వ ఫైనాన్స్ నిధులు విడుదల చేయించాలని ఎంపీ అరవింద్ కు డిమాండ్ చేశారు. కరవు మండలాల్లో కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొస్తారు, ఏం చర్యలు చేపడతారో బీజేపీ ఎంపీలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

నిజామాబాద్ జిల్లాలో 18 కరవు మండలాలు మాత్రమే ప్రకటించారని చాలా ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి వచ్చే పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. పునః సర్వే నిర్వహించి.. మరిన్ని మండలాలతో కొత్త జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కరవు మండలాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపడతారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వడం లేదన్నారు. వరి వేయొద్దని చెబుతున్న ప్రభుత్వం మరి ఏ ఆరుతడి పంటలు వేయాలో చెప్పాలని, ఏ ధరకు కొంటారో కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. కరెంట్ కూడా 3 నుంచి 5 గంటలే వస్తుందని అలాంటి కరెంట్ ను నమ్ముకొని ఏ పంటలు వేయాలో రైతులకు అర్థం కావడం లేదని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>