పేద కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం

కలం, ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మండలం వాల్గొండ హీరాపూర్ గ్రామంలోని అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బుధవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ను (MLA Vedma Bojju Patel) కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా వాల్గొండ హీరాపూర్‌ను దత్తత తీసుకుని ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చేలా గ్రామంలోని అర్హులైన పేద కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుల వినతిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జహీర్, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తమ్, ఎండీ మసూద్, వరుణ్, హీరాపూర్ పటేల్, మారుతిగూడ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>