క‌రీంన‌గ‌ర్ నేత‌ల‌తో టీఆర్ఎస్ చీఫ్ క‌విత భేటీ

క‌లం, క‌రీంన‌గ‌ర్: హైదరాబాద్‌లోని తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ చీఫ్ క‌విత‌ (Kavitha) కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా క‌విత‌ మాట్లాడుతూ.. తెలంగాణ రక్షణ సేన పార్టీ కమిటీలు బూత్‌ స్థాయిలో నిర్మాణం జరగాలన్నారు. ప్రజాల సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సూచించారు. అన్ని పార్టీలకు దీటుగా తెలంగాణ రక్షణ సేన పార్టీ కరీంనగర్‌లో పని చేయాలని చెప్పారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడానికి నాయకులు విస్తృతస్థాయిలో పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్, రాష్ట్ర నాయకులు లింగంపల్లి నాగరాజు,మహిళ అధ్యక్షురాలు అంకం శివరాణి, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, మానకొండూరు నియోజకవర్గం ఇంచార్జ్ చెన్నమల్ల చైతన్య, సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, భాసవేణి రాజేందర్ నూతి సాయి చరణ్, మ్యాక వినోద్, లింగంపల్లి శ్రీనివాస్, రాకేష్, ఎండీ రజి, పూసాల పవన్,ఎండీ సల్మా, ఎండీ అతహార్, చింతరెడ్డి జైపాల్ రెడ్డి, జంగ అపర్ణ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>