గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

కలం, ఖమ్మం బ్యూరో: రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని పోలీస్ శాఖ తరఫున ఏర్పాట్లపై భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రక్షణ, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ స్థలాలు, చెక్ పోస్టుల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.

ఘాట్ల వద్ద నిరంతర నిఘా..

​ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఘాట్ల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రధాన రహదారులతో పాటు పుష్కర ప్రాంతాలకు వచ్చే మార్గాల్లో అవసరమైన చోట చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

వాహనాల పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు..

రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలని, వాహనాల పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను పటిష్ఠం చేయాలని, రిస్క్ ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పుష్కరాల సమయంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించి, ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>