కలం, నిజామాబాద్ బ్యూరో: మున్సిపల్ (Municipal Elections) బరిలో ట్రాన్స్ జెండర్లు దిగుతున్నారు. ట్రాన్స్ జెండర్లకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో హైదారాబాద్ సహా నిజామాబాద్ (Nizamabad) లాంటి ప్రాంతాల్లో సంబురాలు చేసుకున్నారు. హైదారాబాద్ వరంగల్ జగిత్యాల నిజామాబాద్ లాంటి అనేక ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్లకు కో ఆప్షన్ అవకాశం ఉంది. మరోవైపు కార్పొరేషన్లతోపాటు మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు కౌన్సిలర్లుగా పోటీకి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో అధ్యక్షులకు దరఖాస్తులు చేసుకున్నారు. నిజామాబాద్‌లోని 11వ డివిజన్ ట్రాన్స్ జెండర్స్‌కు కేటాయించాలని కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్దన్ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణకు ట్రాన్స్ జెండర్ జరీనా బేగం దరఖాస్తును సమర్పించారు.
నిజామాబాద్ నగరంలో ఉన్న ట్రాన్స్ జెండర్లు అంతా ఏకగ్రీవంగా తీర్మానించుకుని పేరు ప్రతిపాదించారు. మరోవైపు ట్రాన్స్ జెండర్ జరీనా బేగం విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తామని బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. ట్రాన్స్ జెండర్ (Transgender) అర్చన, అమల, కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్, టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ తదితరులు జరీనా బేగంకు మద్దతుగా నిలిచారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కోఆప్షన్ హామీ నిలబెట్టుకుంటుందా? ట్రాన్స్ జెండర్లను కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా అవకాశం కల్పిస్తుందా చూడాలి.
Read Also: దత్తత తీసుకున్న జిల్లాకు ఏం చేశావ్.. సీఎంపై జోగు రామన్న ఫైర్
Follow Us On : WhatsApp


