కలం, వెబ్ డెస్క్: లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణా రెడ్డి (Uday Krishna Reddy)కి బెయిల్ మంజూరు చేస్తూ ఉప్పరపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు రెండు నెలలుగా చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉదయ్‌కృష్ణా రెడ్డి సాయంత్రం లేదా రేపు ఉదయం విడుదలయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్‌కృష్ణా రెడ్డి తోటి మహిళా ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు సంచలనంగా మారాయి.
అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. పోలీసులు ఉదయ్‌కృష్ణా రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కస్టడీలోకి తీసుకుని విచారించి.. ఉదయ్ నుంచి కీలక వివరాలు రాబట్టారు. అదే సమయంలో తనకు బెయిల్ ఇవ్వాలని ఉదయ్ కోరినా తిరస్కరిస్తూ వస్తున్న కోర్టు.. ఎట్టకేలకు విడుదల చేస్తూ ఉత్వర్వులిచ్చింది. తోటి ఐపీఎస్ అధికారిణి చేసిన ఆరోపణలు నిరాధారమని ఉదయ్‌కృష్ణా రెడ్డి అరెస్ట్ సమయంలోనే స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో జాతీయ పోలీస్ అకాడమీ ఆయన శిక్షణను తాత్కాలికంగా నిలిపేసింది.

