ప్రముఖ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్‌కు నోబెల్ బహుమతి

కలం, వెబ్ డెస్క్: అమెరికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్‌ (Francis Halzen)కు 2026 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ మేరకు స్వీడిష్ అకాడమీ ప్రకటన చేసింది. అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ నిర్మాణం, దాని ద్వారా ఖగోళ మూలాలకు చెందిన అధిక శక్తి న్యూట్రినోలను ఆవిష్కరించడంలో ఫ్రాన్సిస్ చేసిన కృషి అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చిందన్నారు.

విశ్వం నుంచి వెలువడే కాస్మిక్ న్యూట్రినోల్లో అత్యంత అధిక శక్తి కలిగినవి అరుదుగా ఉంటాయి. వాటిని గుర్తించాలంటే భారీ పరిమాణంలో మంచు అవసరమవుతుంటుంది. ఫ్రాన్సిస్ హాల్జెన్ నేతృత్వంలో 2011లో ఐస్ క్యూబ్ఓ న్యూట్రినో అబ్జర్వేటరీని నిర్మించారు. అనంతరం దీనిలో చేపట్టిన పరిశోధనలతో అధిక శక్తి గల న్యూట్రినోలను విజయవంతంగా గుర్తించారు. అంతేగాకుండా సౌర వ్యవస్థలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే న్యూట్రినోలు వస్తున్నట్లు నిర్ధారించారు. వీరి కృషిని గుర్తించి నోబెల్ పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు వివరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>