ఉదయ్ కృష్ణారెడ్డికి మరో రెండు రోజుల పోలీస్ కస్టడీ!

క‌లం, వెబ్‌డెస్క్‌: మ‌హిళా ట్రైనీ ఐపీఎస్‌కు వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉద‌య్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) పోలీస్ క‌స్ట‌డీపై నేడు ఉప్ప‌ర‌ప‌ల్లి కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రెండు రోజుల క‌స్ట‌డీకి కోర్టు అనుమ‌తించింది. విచార‌ణ‌కు ఉద‌య్ కృష్ణా రెడ్డి స‌హ‌క‌రించ‌డం లేద‌ని పోలీసులు చెప్తున్నారు. అయితే మ‌హిళ‌కు వేధింపుల‌పై త‌న త‌ప్పును అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఈ మ‌హిళా ట్రైనీ ఐపీఎస్‌కు వేధింపుల‌తో పాటు ఉద‌య్ సోష‌ల్ మీడియాలో మ‌రికొంద‌రు మ‌హిళ‌ల‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ట్లు విచార‌ణ‌లో తేలింది. అయితే వాళ్లు ప్ర‌పోజ్ చేస్తేనే తాను అంగీక‌రించిన‌ట్లు ఉద‌య్ వెల్ల‌డించాడు.

మ‌రోవైపు గత విచారణ సమయంలో త‌న‌ ఐఫోన్, ఈ కేసుకు సంబంధించిన‌ ఆధారాల దాచివేతపై ఉద‌య్ విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో మ‌రిన్ని కీల‌క అంశాలు రాబ‌ట్టేందుకు పోలీసులు మ‌రో రెండు రోజులు విచార‌ణ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ కేసులో సీపీ స‌జ్జ‌నార్ (CP Sajjanar) కూడా జోక్యం చేసుకున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చి ఆయ‌న స్వ‌యంగా ఉద‌య్‌(Uday Krishna Reddy)ని విచారించారు. ఇప్పుడు ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో అత్తాపూర్ పోలీసులు ఉద‌య్‌ని అదుపులోకి తీసుకొని విచార‌ణ చేయ‌నున్నారు.

Also Read : 13 ఏళ్ల తర్వాత కొడుకు ఆట చూసిన తల్లిదండ్రులు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>