కలం, స్పోర్ట్స్ : న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో (BWF World Championships) భారత్ శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్‌లో భారత జోడీ ఎం.ఆర్. అర్జున్, హరిహరన్(MR Arjun-Hariharan) తొలి రౌండ్లో విజయం సాధించి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లారు. ఐర్లాండ్‌కు చెందిన స్కాట్ గిల్డియా, పాల్ రేనాల్డ్స్ జోడీతో జరిగిన మ్యాచ్‌లో అర్జున్-హరిహరన్ 21-16, 6-4తో ఆధిక్యంలో ఉన్నారు. ఈ సమయంలో ప్రత్యర్థి ఆటగాడు గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో భారత జోడీని విజేతగా ప్రకటించారు.
13 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల ముందే మ్యాచ్
ఈ విజయం అర్జున్‌కు భావోద్వేగ క్షణంగా మారింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆయన తల్లిదండ్రులు, భార్య స్టేడియం గ్యాలరీలో కూర్చుని ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించారు. చిన్నతనంలో తన తండ్రి తనను మ్యాచ్‌లకు తీసుకెళ్లేవారని అర్జున్ గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత టోర్నీల కోసం తాను ఒంటరిగానే ప్రయాణించడం అలవాటు చేసుకున్నానని తెలిపారు. తన తండ్రి ఇప్పటివరకు ఫోన్లోనే తన మ్యాచ్‌లను చూసేవారని, ఇప్పుడు స్టేడియంలో నేరుగా తన ఆటను వీక్షించడం ఎంతో ఆనందంగా ఉందని అర్జున్ పేర్కొన్నారు.
తొలి పాయింట్లే కీలకం
టోర్నీలో (BWF World Championships) ఆరంభ పాయింట్లు సాధించడం చాలా ముఖ్యమని అర్జున్ అన్నారు. స్వదేశీ అభిమానుల మద్దతు తమలో మరింత ఉత్సాహాన్ని నింపిందని హరిహరన్ తెలిపారు. కోర్టులో డ్రిఫ్ట్ ప్రభావం కూడా పెద్దగా ఇబ్బంది కలిగించలేదని పేర్కొన్నారు. ఈ విజయంతో భారత జోడీ తదుపరి రౌండ్లోకి ప్రవేశించింది. స్వదేశంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత ఆటగాళ్లు ఇదే జోరును కొనసాగించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Also Read : CSK కొత్త కోచ్ ఎవరు? మైఖేల్ హస్సీకి శ్రీకాంత్ మద్దతు
Follow Us On : WhatsApp

