కలం, వెబ్ డెస్క్ : కామారెడ్డిలో (Kamareddy) ఐదుగురు చిన్నారుల మిస్సింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో తీవ్ర విషాదం నెలకొంది. ఇందులో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. కామారెడ్డిలో నిన్న గోసంగి కాలనీకి చెందిన అన్నదమ్ములు సింహాద్రి (10), విజయ్ (9)లతో పాటు ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సీపల్ (8), ఆయాత్ (7), మరియం (5)లు వేర్వేరుగా ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయారు.
ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు గాలించగా.. ముగ్గురు అక్కాచెళ్లెల్లు మృతి చెందినట్టు గుర్తించారు. స్థానిక చెరువులో ఇద్దరు అక్కాచెళ్లెళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో చిన్నారి కోసం పోలీసులు చెరువులోనే గాలిస్తున్నారు. చిన్నారుల తండ్రి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే తండ్రి ఎందుకు చంపాడనేది తెలియాల్సి ఉంది. పైగా మరో ఇద్దరు అన్నాదమ్ములు ఎక్కడున్నారో ఇంకా తెలియరాలేదు.

