మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వండి : సాయి దుర్గ తేజ్

కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో తెలంగాణ (Telangana) పోలీస్ మహిళా భద్రత విభాగం నిర్వహించిన స్టాండ్ విత్ హర్” (Stand With Her) కార్యక్రమానికి టాలీవుడ్ నటుడు సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) బ్రాండ్ అంబాసిడర్‌ (Brand Ambassador) గా నియమితులయ్యారు.  మహిళల భద్రత, గౌరవంపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమంలో, ప్రతి అమ్మాయిని తల్లిలా గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. తాజాగా ఈ కార్యక్రమ అవగాహణలో భాగంగా ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియోలో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) మహిళలకు సపోర్ట్ గా నిలవాలంటూ అవగాహన కల్పించారు.

నాకూ ఓ ఆడపిల్ల ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఏదో భయం.. ప్రతీ సారి అమ్మాయి అనే పదం తక్కువలా వాడటం అలవాటైపోయింది. అందుకే భయం. రోజూ మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి ఆలోచించామా.. వారి కోసం పెద్ద పెద్ద పనులేమి చేయాల్సిన అవసరం లేదు. రోజూ లేవగానే దుప్పటి మడత పెడితే చాలు.. కాఫీ కప్పు సింక్ దగ్గర పెడితే చాలు.. ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వింటే చాలు.. అమ్మాయి ఉన్నత స్థానాలకు ఎదుగుతుంటే అది తన కష్టం వల్లనే అని నమ్మితే చాలు.. కేర్ అనే ముసుగులో కంట్రోల్ చేయకుంటే చాలు.. నాట్ ఆల్ మెన్ అని రాయడం కాదు.. నాట్ ఆల్ మెన్ అని ప్రూవ్ చేయాలి.. వాళ్ళ కోసం వానర సైన్యంలాగా నిలబడాలి అంటూ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>