ఉపాధ్యాయుల శ్రేయస్సు.. దేశ హితమే తపస్ లక్ష్యం : TPUS

కలం, నిర్మల్ : ఉపాధ్యాయుల శ్రేయస్సుతో పాటు దేశ హితాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) నిరంతరం పనిచేస్తోందని సంఘం రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రెండు రోజులపాటు నిర్వహించిన తపస్ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశాలకు నిర్మల్ జిల్లా నాయకులు హాజరయ్యారు.

ఈ సమావేశాలకు ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ కార్యదర్శి మహేంద్ర కపూర్‌, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పెంటయ్య పాల్గొన్నారు. జాతీయవాద భావజాలాన్ని పెంపొందిస్తూ వికసిత భారత నిర్మాణ లక్ష్య సాధనకు ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడంతో పాటు, ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన హక్కుల కోసం తపస్ చిత్తశుద్ధితో పోరాడుతుందని నాయకులు తెలిపారు. ఈ సమావేశాల్లో నిర్మల్ జిల్లా ప్రతినిధిగా తపస్ జిల్లా అధ్యక్షుడు శశిరాజ్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>