కలం, ఖమ్మం బ్యూరో : ఉపాధ్యాయుల మార్గనిర్దేశంలోనే విద్యార్థులు ఉన్నతంగా ఎదుగుతారని, సమాజ పురోగతికి ఉపాధ్యాయులే దిక్సూచీ అని నల్గొండ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. రమాదేవి అన్నారు. శనివారం యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం (Kothagudem) లోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని 24 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది.
ముఖ్య అతిథులుగా హాజరైన డిప్యూటీ కలెక్టర్ రమాదేవి, MVI సంగం వెంకట పుల్లయ్య, జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రంగా ప్రసాద్‌లు ఉపాధ్యాయులను అవార్డులతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధించే విద్యాబుద్ధులే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిస్తాయన్నారు.
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు. పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, చుంచుపల్లి తదితర మండలాలకు చెందిన 24 మంది ఉపాధ్యాయులు ఈ పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జె.బి.బాలు, బి. వీరు నాయక్, సాయి కృష్ణ, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

