టీబీ బాధితులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ

కలం, కరీంనగర్: క్షయ వ్యాధి (టీబీ)తో బాధపడుతున్న వారికి పౌష్టికాహారం అందించడం అభినందనీయమని అంకిత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కవ్వంపల్లి అనురాధ అన్నారు. ఇటీవల మానకొండూరు పీ.హెచ్.సీలో క్షయ వ్యాధి పీడితులుగా నమోదైన వారికి మాధవి సీడ్స్ అధినేతలు రేమిడి శ్రీనివాసరెడ్డి–సత్యవతి దంపతులు పౌష్టికాహార కిట్లను అందించారు. శనివారం మానకొండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (Manakondur PHC) వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ అనురాధ రోగులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీబీ వ్యాధి సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీకి సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయని, వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వినియోగించుకోవాలని సూచించారు. టీబీ బాధితులు మందులతో పాటు బలవర్ధకమైన, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. టీబీ బాధితులకు నిత్యావసర సరుకులతో కూడిన పౌష్టికాహార కిట్లను అందించిన రేమిడి శ్రీనివాసరెడ్డి–సత్యవతి దంపతులను డాక్టర్ అనురాధ అభినందించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, ప్యాక్స్ చైర్మన్లు ముద్దసాని శ్రీనివాస్‌రెడ్డి, నాగిశెట్టి రాజయ్య, గంగుల రామిరెడ్డి, రొంటాల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మర్రి ఓదెలు యాదవ్, తిరుమలరెడ్డి, బుర్ర శ్రీధర్ గౌడ్, మడుపు ప్రేమ్‌కుమార్, కోండ్ర సురేష్, రేవెల్లి రాజలింగం, కనకం అశోక్, గొల్లెన కొమురయ్య, ఎన్. బాపురావు, బాకారపు సమ్మయ్య, ఎడ్ల శ్రీధర్, బుర్ర శ్రీకాంత్, బక్కారెడ్డి,దూలం దేవేంద్ర, దూలం వీరస్వామి, ఎర్రోళ్ల కవిత, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>