కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం రాత్రి నిర్వహించిన కన్నడ స్టార్ నటుడు యశ్ ‘టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఊహించని అపశృతి (Toxic Accident) చోటుచేసుకుంది. వేడుక సందర్భంగా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లడ్ లైట్ స్తంభం, సౌండ్ సిస్టమ్ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడే ఉన్న ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఆకస్మిక ప్రమాదంతో తీవ్ర భయాందోళనకు గురైన ఒక యువతి అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను, స్పృహ తప్పిన యువతిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

