కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : జైలులో పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ, ఖైదీల సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పని చేస్తానని జిల్లా జైలు సూపరింటెండెంట్ దార్ల కాళిదాసు అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా, జిల్లా సబ్ జైళ్ల అధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దార్ల కాళిదాస్ (Darla Kalidas) జిల్లా కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ను మర్యాద పూర్వకంగా కలిశారు. 1999 బ్యాచ్‌కు చెందిన కాళిదాస్ బదిలీపై మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జైళ్ల శాఖలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా క్రమశిక్షణ, భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ ఖైదీల సంక్షేమం, పునరావాస కార్యక్రమాల సమర్థ అమలుకు కృషి చేస్తామని తెలిపారు. జైళ్లలో సానుకూల వాతావరణం నెలకొల్పడంతో పాటు ఖైదీలలో నైపుణ్యాభివృద్ధి, సామాజిక పునరావాసానికి అవసరమైన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
దార్ల కాళిదాస్ (Darla Kalidas) గతంలో చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో విధులు నిర్వహించారు. అలాగే చర్లపల్లి కేంద్ర కారాగారం, ఓపెన్ జైలు తదితర జైళ్లలో వివిధ హోదాల్లో పనిచేసి విశేష పరిపాలనా అనుభవాన్ని సంపాదించారు. మహబూబ్‌నగర్ జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన శ్రీ శశికాంత్ చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి బదిలీ కావడంతో, ఆయన స్థానంలో దార్ల కాళిదాస్ నియమితులై బాధ్యతలు స్వీకరించారు.
Also Read : గుడ్ న్యూస్.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు విడుదల
Follow Us On : WhatsApp

