కలం, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గాదంకి టోల్ ప్లాజా సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Tirupati Road Accident) చోటుచేసుకున్నది. వేగంగా వెళ్తున్న ఓ సుమో వాహనం అదుపుతప్పి ముందు వెళ్తున్న టిప్పర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సుమోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
మృతులను చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే చంద్రగిరి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై అరగంటకు పైగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

