Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమలలో భద్రతా లోపం.. క్యూ కాంప్లెక్స్‌ వీడియో కలకలం

కలం, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయ భద్రతలో టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి (Vaikuntam Queue Complex)  మొబైల్ ఫోన్‌తో ప్రవేశించిన ఓ భక్తుడు అక్కడి లోపలి దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే క్యూ కాంప్లెక్స్‌లోకి మొబైల్ ఫోన్ ఎలా చేరిందన్న ప్రశ్న భక్తులలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. భద్రతా తనిఖీలలో లోపాలు ఉన్నాయని, టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో తిరుమల భద్రతా వ్యవస్థపై మరోసారి చర్చ మొదలైంది. క్యూ కాంప్లెక్స్‌లో నిఘా మరింత కఠినతరం చేయాలని భక్తులు కోరుతున్నారు. టీటీడీ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>